విద్యా,వైజ్ఞానిక,సాహిత్య,సాంస్కృతిక, సామాజిక,సేవ రంగాలలో విద్యార్థులను ప్రతిభావంతులుగా తయారు చేసి ఉత్తమ పౌరులుగా తీర్చి దిద్దడమే ఈ సంస్థ ప్రధాన లక్ష్యం. అనకాపల్లి లోని వివిధ కళాశాలలలోని విద్యార్థినీ విద్యార్థులను,యువకులను ఇందులో సభ్యులుగా చేర్చుకోవడం జరుగును.సభ్యులలో చురుకుదనం గలవారిని కార్యవర్గ సభ్యులుగా ఎంపికచేసి వివిధ రంగాలలోని ప్రసిద్ధులైన వారిని ఆహ్వానించి వారిచే నెలకు ఒక సమావేశాన్ని సంస్థ ఏర్పాటుచేస్తుంది.
విద్యారంగం:
- విద్యా రంగం నుంచి ప్రముఖులైనవారిని ఆహ్వానించి విద్యార్థుల వ్యక్తిత్వ వికాసా
నికి వారి విద్యా, ఉపాది అవకాశాలకు సంబంధించిన అనేక అంశాలఫై వారిచే అవగాహనా సదస్సులు సంస్థ నిర్వహింఛి ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దుతుంది.
వైజ్ఞానిక రంగం:
- నేటి సాంకేతిక యుగంలో సాంకేతిక అంశా
లపట్ల అవగాహన కలిగించే అంశాలతో సమావేశాలను ఈ సంస్థ ఏర్పరుస్తుంది. ఉదా: ఇంటర్నెట్, కంప్యూటర్స్కు సంబంధించిన అవగాహన సదస్సులు,ఆడియో-వీడియో, ఫోటోషాప్ పేజి మేకర్లను ఉపయోగించుట మొదలగు అంశాలపట్ల అవగాహన కల్పించుట
సాహిత్య రంగం:
- గ్రూప్ ,సివిల్స్ పరీక్షలలో తెలుగు సాహిత్యం ఒక ఆప్షనల్ సబ్జెక్టు
గా ఎంచుకొని మంచి మార్కులు పొం కలిగించుదే పరిజ్ఞానాన్ని వారికి ట. - విధ్యార్ధులను సాహిత్యపరంగా తీ
ర్చిదిద్దేందుకు సాహిత్యపరమైన ఫోటీలు నిర్వహించుట,కవులుగా రచయితలుగా తయారూ చేసి సభ్యులకు పోయెట్రీ వర్క్ షాప్ నిర్వహించు ట - వివిధ పత్రికల్లో వీరు రచించిన కవితలు
,కథలు ప్రచురింపజేసి ప్రోత్సహించుట . - సాహితీ ప్రముఖులతో సమావేశాన్నిస
ంస్థ ఏర్పాటు చేస్తుంది.
సాంస్కృతిక రంగం:
- విద్యార్థులలో దాగిఉన్న వివిధ
కళలను గుర్తించి వారిని ప్రోత్సహించుట. - విద్యార్థులు వారి ప్రతిభను ప్రదర్శించుకోడానికి చక్కని వే
దికగా ఈ సంస్థ ఉపకరిస్తుంది. - గానం,నృత్యం,చిత్రలేఖనం,మొదలగు
న్న పోటీలను నిర్వహిస్తూ,సభ్యులనూ ప్రోత్సహి ంచుట మాత్రమే కాక ఇటువంటి కళలపట్ల అభిరుచిగల విద్యార్థినీ ,విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం జరుగును.
సామాజిక రంగం:
- సమాజంలో నెలకొనివున్న వివిధ అంశాల పట్ల ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చేందుకు ఈ సంస్థ కార్యక్రమాలను చేపడుతుంది.
- ఎయిడ్స్, మద్య- ధూమపానం మొదలగు వ్యసనాలవల్ల కలిగే దుష్
పరిణామాల పట్ల అవగాహన కలిగిస్తుంది.
సేవా రంగం:
- సేవా పరంగా కూడా విద్యార్థులను
తీర్చిదిద్దేందుకు ఈ సంస్థ కృషి చేస్తుంది. మొక్కలు నాటడం, పర్యావరణ పరిరక్షణ మొదలగు అంశాల గూర్చి కృషి చేస్తుంది. - సంస్థలో సభులుగా చేరినవారి పేర్లు ఈ సంస్థల బ్లాగ్లలో నమోదు చేయబడును. కార్యక్రమాల ఫోటోలు,
వివరాలు బ్లాగ్లలో ఎప్పటికప్పుడు చేర్చ బడును. s m s ద్వారా సభ్యులకు ఈ సంస్థ కార్యక్రమాలు తెలియజేయబడును.
No comments:
Post a Comment